![]() |
![]() |

సోషల్ మీడియాలో బంగారం సాంగ్ 1 మిలియన్ వ్యూస్ దాటేసింది రిలీజయిన ఒక్క రోజులోనే. అందులో నటించిన డీమన్ పవన్, రీతూ చౌదరి కూడా ఏదో రీల్ కపుల్ అన్నట్టు కాకుండా రియల్ కపుల్ అన్నట్టుగా చాలా సహజంగా నటించారు. ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఎమోషన్స్ కానీ సాంగ్ లిరిక్స్ కానీ బ్యాక్ గ్రౌండ్ విజువల్స్ కానీ అన్నీ ఈ సాంగ్ కి సరిగ్గా కుదిరాయి. దానికి తోడు ఇద్దరూ బిగ్ బాస్ నుంచి తెలిసిన జంటే. ఒకప్పుడు సుధీర్ రష్మీ జోడి ఎలా ఒక ఊపు ఊపారో ఇప్పుడు రీతూ - పవన్ జోడి ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. వీళ్ళు పెళ్లి చేసుకుంటే రియల్ లైఫ్ బాగుండు అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి బంగారం సాంగ్ లాంచ్ లో జరిగిన ఇంటర్వ్యూలో కొన్ని విషయాలను రివీల్ చేసింది రీతూ.
"విష్ణుప్రియ గారు మీరు ఎక్కువ ట్రిప్స్ లో కనిపించేవాళ్లు . ఎక్కువ వీడియోస్ కూడా చేసేవాళ్లు. కానీ 2 ఇయర్స్ గ్యాప్ వచ్చిందా ఎందుకు ఏమిటి.. ఇద్దరూ కూడా కలిపి వస్తామని కూడా అనుకున్నారు బిగ్ బాస్ కి కానీ విడివిడిగా వచ్చారు " అని యాంకర్ అడిగిన ప్రశ్నకు రీతూ చౌదరి కొంచెం ఆలోచించుకుని ఆన్సర్ ఇచ్చింది. "అంటే ఏమీ లేదు. ఫన్ విడివిడిగా ఉండాలి కాబట్టి. ఇప్పటికీ విష్ణు ప్రియా నాకు మంచి ఫ్రెండ్. తాను చాలా హ్యాపీగా ఉండాలనుకుంటాను. అంతే" అంది. "బిగ్ బాస్ వస్తోంది కదా ఎలా ఉండబోతోందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు " అని అడిగేసరికి " బిగ్ బాస్ సీజన్ 10 హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సీజన్ 9 ని సూపర్ హిట్ చేసారు. బిగ్ బాస్ అనేది చాలామందికి ఇష్టం కాబట్టి తప్పకుండా హిట్ చేస్తారు. " రీల్ కపుల్ రియల్ కపుల్ అయ్యే అవకాశం ఉందా..కామెంట్స్ లో కూడా చాలామంది ఇద్దరూ ఒక్కటైతే బాగుంటుంది అని అడుగుతున్నారు కదా " అని అడిగారు. "రియల్ కపుల్ అవ్వాలంటే అంత ఈజీ కాదు.. అది చాలా టైం తీసుకుంటుంది. అర్ధం చేసుకోవడం ఇలా ఒక్క విషయం కాదు చాలా విషయాల్లో అర్ధం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. కానీ ఇలాగే మాకు హ్యాపీ గా ఉంది. మేము ఇలాగే హ్యాపీగా ఉంటాము. మీరు కూడా హ్యాపీగా మమ్మల్ని ఇలాగే చూడండి చాలు. " బంగారం సాంగ్ కి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారు.. ఇచ్చారా అసలు " అని అడిగేసరికి "అది చెప్పకూడదండి. ఎందుకు ఇవ్వకుండా ఉంటారు. పవన్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఎవరిదో తీసుకుని చేయడం ఇష్టం ఉండదు. బడ్జెట్ విషయంలో చాలా క్లియర్ గా ఉన్నాడు. "చాలా ఎక్కువ ఖర్చు అయ్యిందని తెలుస్తోంది. మీరేమన్నా తగ్గించారేమో అని షేరింగ్ లో ఏమన్నా యాక్సెప్ట్ చేశారేమో " అనేసరికి " జరిగింది ఏదో ఒకటి. కానీ బాగా వచ్చింది బాగా జరిగింది. డబ్బులు తీసుకోకుండా ఐతే ఏమీ చేపించుకోలేదు. డబ్బులు ఇచ్చే యాక్ట్ చేయించుకున్నాడు అని చెప్పేది రీతూ చౌదరి.
![]() |
![]() |